గత వారం రోజులుగా భారీ వర్షాలతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటలకు బలహీన పడి అల్పపీడనంగా మారిందని, దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం తప్పినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు పూర్తిగా తగ్గి కొద్ది రోజులు తెరిపి ఇస్తే కానీ గ్రామాలు, పట్టణాల నుంచి వరదనీరు బయటకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెడ్‌అలర్ట్ ఉపసంహరించిన వాతావరణ శాఖ.. సాధారణ హెచ్చరికను జారీ చేసింది. అయితే.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పెద్దపల్లి, జయశంకర్ భూపాల్‌పల్లి, ములు గు, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లా ల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాథమిక హెచ్చరిక చేసింది హైదరాబాద్
వాతావరణ కేంద్రం.