తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త.. నిమ్స్‌లో బీఎస్సీ కోర్సులు

తెలంగాణలోని విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ కోర్సుల్లో నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) ప్రవేశాలు కల్పిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఆగస్టు 4లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. న్యూరో టెక్నాలజీ, డయాలసిస్‌, కార్డియోవాస్కులర్‌, ఎమర్జెన్సీ అండ్‌ ట్రామాకేర్‌, రేడియో థెరఫీ, మెడికల్‌ ల్యాబరేటరీ టెక్నాలజీ, అనస్థీషియా, పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ, రేడియేషన్‌ థెరఫీ, రెసిపిరేటరీ థెరఫి అండ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ వంటి కోర్సులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు అధికారులు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ప్రాతిపదికన సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు అధికారులు.

Hyderabad: NIMS offers free diagnostic tests for OGH patients

వివరాలకు నిమ్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు అధికారులు. అయితే ఇదిలా ఉంటే.. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో గత వారం రోజులుగా నిర్వహించాల్సిన షెడ్యూల్డ్‌ పరీక్షలను వాయిదా వేస్తున్న ప్రకటించిన ఉన్నత విద్యామండలి.. త్వరలోనే వాయిదా పడ్డ పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని ప్రకటించింది. అయితే ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు యథాతధంగా సాగుతాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా భారీ వర్షాల నేపథ్యంలోనే తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. తిరిగి విద్యాసంస్థలు సోమవారం నాడు పునః ప్రారంభం కానున్నాయి.