పదో తరగతి బాలికపై టీచర్ లైంగిక దాడి…నగ్నంగా ఫోటోలు తీసి మరీ !

-

దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ప్రతి రోజు ఏదో ఓ మూలన… మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ని కఠినమైన నిర్నయాలు, చట్టాలు అమలు చేసినా.. ముర్ఖులకు బుద్ది రావడం లేదు. ఇంకా రెచ్చి పోయే ప్రవర్తి స్తున్నారు. అయితే తాజాగా రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో 10 వ తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్ టీచర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బట్టలు విప్పి.. ఆ బాలికపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. సిగరేట్లతో కాల్చాడు ఆ దుర్మార్గుడు. గత ఆరు నెలలుగా… ఆ బాలికపై స్కూల్‌ టీచర్‌ ఈ ఆగాయిత్యానికి పాల్పడుతున్నాడు. అయితే… ఇటీవల ఆ బాలిక గర్భవతి కావడంతో.. తల్లిదండ్రులు ఆమెను మందలించారు.

దీంతో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది ఆ బాలిక. ఇక ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి.. ఫిర్యాదు చేశారు ఆ బాలిక కుటుంబ సభ్యులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..నిందితున్ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news