పల్లె పోరు మరింత ఆసక్తికరం.. బ్యాలెట్ లో నోటా !

-

ఈ సారి పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారననున్నాయి. ఎందుకంటే మొట్టమొదటి సారిగా పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో ‘నోటా’ కూడా స్థానం దక్కించుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన పదహారు గుర్తులతో బ్యాలెట్ పేపర్లు ముద్రిస్తారు. ఈ విధంగా ముద్రించిన బ్యాలెట్ ‌లో అన్నిటికంటే అట్టడుగున ‘నోటా’కు కూడా చోటిచ్చారు. పోటీలో ఉన్న అభ్యర్ధులు ఎవరూ నచ్చక పోతే ఇప్పుడు నోటాకు వేసుకోవచ్చు. ఇక ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. 

తొలి విడతలో 12 జిల్లాల్లోని 18 డివిజన్ల పరిధిలోని 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లా డివిజన్లు: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ. విశాఖ జిల్లా డివిజన్: అనకాపల్లి. తూ.గో. జిల్లా: డివిజన్లు: కాకినాడ, పెద్దాపురం. ప.గో జిల్లా: డివిజన్: నర్సాపురం. కృష్ణా జిల్లా: డివిజన్: విజయవాడ. గుంటూరు జిల్లా: డివిజన్: తెనాలి. ప్రకాశం జిల్లా: డివిజన్: ఒంగోలు. నెల్లూరు జిల్లా: డివిజన్: కావలి డివిజన్‌. కర్నూలు జిల్లా: డివిజన్: నంద్యాల, కర్నూలు. అనంతపురం జిల్లా: డివిజన్: కదిరి. కడప జిల్లా: డివిజన్లు: కడప, జమ్మలమడుగు, రాజంపేట. చిత్తూరు జిల్లా: డివిజన్: చిత్తూరు.

Read more RELATED
Recommended to you

Latest news