బ్రేకింగ్ : తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు

-

తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలో టీడీపీ కార్యాలయం కోసం భూ కేటాయింపులపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి జరిపిన భూ కేటాయింపులను రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్ వేశారు.

విచారణ చేసిన జస్టిస్ నారీమన్ ధర్మాసనం తెలుగుదేశం పార్టీకి, ఏపీ ప్రభుత్వం, సి.ఈ.ఆర్.డి.ఏ కు నోటీసులు జారీ చేసింది. ఆర్.కే తరఫున ప్రశాంత్ భూషణ్, రమేష్ లు వాదనలు వినిపించారు. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాల తర్వాత సుప్రీం కోర్టు చేపట్టనుంది. గతంలో ఆర్కే పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేయగా హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news