అలెర్ట్… మే నెల‌లో దాదాపు సగం రోజులు బ్యాంకు సెల‌వులు

-

మే నెలలో మీకు ఏదైనా బ్యాంకు పని ఉందా?. అయితే వెంటనే అప్రమత్తమవ్వండి. ఎందుకంటే మేలో చాలా రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు వస్తున్నాయి. మొత్తం 12 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఇందులో 5 ఆదివారాలు (2, 7, 9, 16, 23, 30 తేదీలు), 8వ తేదీ రెండో శ‌నివారం, 22 వ తేదీ నాలుగో శ‌నివారం మొత్తం ఈ 7 రోజులు సాధారణ సెలవులు ఉన్నాయి. ఇక మే 1న మేడే, 7వ తేదీన జ‌మాతుల్ విద, 13 న ఈదుల్ ఫిత‌ర్‌, 14న రంజాన్‌, 26 బుద్ధ‌పూర్ణిమ‌లు కూడా సెలవులు దినాలు. దీంతో మొత్తం 12 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు కావడంతో ఏదైనా పని ఉన్న వారు ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.

 

ఇక బ్యాంకు వినియోగదారులు మరో విషయం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకులు 4 గంటలు మాత్రమే తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకు కార్యకలాపాలు సాగనున్నాయి. బ్యాంకులు ప్రజలకు 4 గంటలు మాత్రమే అందుబాటులో ఉండడంతో ప్రజలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కరోనా కారణంగా 50 శాతం ఉద్యోగులు మాత్రమే బ్యాంకుకు వెళ్లనున్నారు. మిగిలిన వారు ఇంటి నుంచి పని చేసుకోవాలి. ఇక రొటేషన్ ప్రాతిపదికన ఉద్యోగులు బ్యాంకులకు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news