ఎస్బీఐ గుడ్‌న్యూస్‌.. ఇంట్లోనే ఈజీగా నామినీని జత చేయవచ్చు!

-

కొవిడ్‌ నేపథ్యంలో బ్యాంకు పనివేలలను కుదించారు.లాక్‌డౌన్‌ కూడా ఉండటంతో బ్యాంకు సంబంధిత పనులు కొన్ని ఆన్‌లైన్‌లోనే నిర్వహించుకునే విధంగా ఎస్బీఐ (SBI) అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో వినియోగదారులు బ్యాంకుకు వెళ్లకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నామినీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఎస్బీఐ | State Bank Of India | SBI
ఎస్బీఐ | State Bank Of India | SBI

మీ బ్యాంకు ఖాతాకు నామినీ పేరును జత చేయాలనుకుంటే ఇక ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎస్బీఐ కస్టమర్‌ అయితేనే ఈ వెసులుబాటు. దీంతో ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ నామినీ పేరును జత చేయవచ్చు. దీన్ని ఆన్‌లైన్‌ ఎస్బీఐ లేదా యోనో లైట్‌ యాప్‌ ద్వారా కూడా చేయవచ్చు. ‘ మీ బ్యాంకు ఖాతాకు నామినీ పేరును జత చేయాలా?’ అనే ఆప్షన్‌ ద్వారా సులభంగా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీన్ని మీ ఇంటి నుంచే సేఫ్‌గా వాడి పని పూర్తి చేసుకోవచ్చని ట్వీట్టర్‌ ద్వారా ఎస్బీఐ తెలిపింది.

ఎస్బీఐ నామినీ అప్డేడ్‌ చేసే విధానం

  • ముందుగా ఎస్బీఐ వినియోగదారుడు తన యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ ద్వారా onlinesbi.com లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.
  • రిక్వెస్ట్‌ అండ్‌ ఎంక్వైరీస్‌ సెక్షన్‌పై క్లిక్‌ చేయాలి
  • అందులో online nomination సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • మీకు ఒకటి కంటే ఎక్కువ ఎస్బీఐ ఖాతాలు ఉంటే అన్ని వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అందులో కస్టమర్‌కు ఏ ఖాతాకు నామినీని జత చేయాలో ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత continue ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.
  • అప్పుడు నామినీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అంటే నామినీ పేరు, పుట్టిన సంవత్సరం, ఖాతాదారుడితో అతడికి ఉన్న సంబంధం వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
  • చివరగా submit బటన్‌ను క్లిక్‌ చేయాలి.
    స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లు హై సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఖాతాకు సంబంధించిన అప్డేట్స్‌ రిజిస్టర్డ్‌ నంబర్‌కే వస్తాయి.
  • పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయగానే confirm ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. అందే నామినీ యాడ్‌ అయినట్లే.

ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాకు నామినీని జత చేయవచ్చు!

Read more RELATED
Recommended to you

Latest news