బిజినెస్ ఐడియా: కుందేళ్ళ పెంపంకంతో ఇలా లాభాలు పొందండి..!

మీరు ఏదైనా వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక మంచి ఐడియా. ఇలా కనుక వ్యాపారం చేస్తే మంచి లాభాలు పొందొచ్చు. ఇక వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

మీరు చిన్నగా ఓ 50 కుందేళ్లు మాత్రమే పెంచాలని అనుకుంటే కొద్దిగా స్థలం కావాలి. అవి పెరిగే సైజు కంటే రెట్టింపు ఉంటే చాలు. రూ.4000 పెట్టుబడి పెడితే కుందేళ్లు వచ్చేస్తాయి. అవి తినడానికి ఎండిన గడ్డి, క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, క్యాలీఫ్లవర్ ఆకులు వంటివి కొనాల్సి ఉంటుంది.

ఇవి సంవత్సరానికి నాలుగు సార్లు పిల్లల్ని పెడతాయి. ఒక్కో కుందేలూ ఆరు పిల్లలు పెట్టగలదు. ఇది ఇలా ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలంటే ముందుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

కంపెనీ పేరు చెప్పాలి. ఆ పేరు పై మీకు ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు. మీరు కావాలంటే ముద్ర స్కీమ్ నుండి రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ లోన్ తీసుకోవచ్చు. వీటి ఫర్ ని క్లాత్ ఇండస్ట్రీకి అమ్ముకోవచ్చు. ఇళ్లలో పెంచుకోవడానికి కుందేళ్లను కొనుక్కుంటారు. ఆలా కూడా సెల్ చెయ్యచ్చు. ఇలా ఈజీగా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంచిగా డబ్బులు పొందొచ్చు.