కెనడాలో అంబరాన్నంటిన ‘తాకా’ సంక్రాంతి సంబరాలు…!!!

-

కెనడాలో ఉండే తెలుగు ఎన్నారైల అభివృద్ధి కోసం పనిచేస్తూ సేవలందిస్తున్న సంస్థ తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా ( తాకా). తాకా సంస్థ వారు తెలుగువారి సంతోషం కోసం, తెలుగు పండుగలలో పెద్ద పండుగైన సంక్రాంతి వేడుకలను కెనడాలో గల ఎటోబీకోక్ లోని మైఖేల్ పవర్  స్కూల్ ఆడిటోరియం లో ఘనంగా నిర్వహించారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఈ వేడుకలకు ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా..

సంబరాలకు వచ్చిన తెలుగు వారు వారి పిల్లలకు భోగి పళ్ళను పోశారు. ఈ వేడుకలలో ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి, అందులో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందించారు. పోటీల అనంతరం తాకా  అధ్యక్షులు  శ్రీనాద్ కుందూరి సంక్రాంతి పండుగ గురించి కొంతసేపు ఉపన్యసించారు. సంక్రాంతి పండుగను గూర్చి పిల్లలకి తెలియజేస్తూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని తెలియచేశారు.

 

ఈ క్రమంలోనే, 2020 తెలుగు క్యాలండర్ ను ఆవిష్కరిస్తూ, ఈ ఏడాది జులై  11,12 తేదీ లలో జరగనున్న తాకా వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడానికి సభ్యులందరూ కృషి చేయాలని సభా ముఖంగా కోరారు. తరువాత వేడుకల్లో పాల్గొన్న వారంతా తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు భోజనం చేశారు. విందు తరువాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి, అందులో కొందరు నృత్య ప్రదర్సనలు చేస్తూ, మరికొందరు సినిమా పాటలు పాడుతూ అందరిని అలరించారు. ఈ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసినందుకు ప్రతీ ఒక్కరికి తాకా అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news