RRR మూవీలో నాతో కలిసి దూకిన పులి ఇదే.. ఆస్కార్ రెడ్ కార్పెట్​పై ఎన్టీఆర్ కామెంట్స్

-

ఆర్ఆర్ఆర్ సినిమా విశ్వ సినీ యవనికపై సత్తా చాటింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారిగా బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్​ను వరించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్​లోని డాల్బీ థియేటర్​లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకలో నాటు నాటు పాటకు పురస్కారం దక్కింది. ఈ వేడుకకు హాలీవుడ్ సినీ తారలతో పాటు నామినేట్ అయిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తారలంతా హాజరయ్యారు.

అంతకుముందు తారలంతా రెడ్ కార్పెట్​పై నడిచారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో రెడ్ కార్పెట్​పై సందడి చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్​లు బ్లాక్ కలర్ శర్వాణీలో రెడ్ కార్పెట్​పై నడించారు. అయితే రెడ్ కార్పెట్​పై యాంకర్​కు, ఎన్టీఆర్​కు మధ్య ఫన్నీ సంభాషణ చోటుచేసుకుంది. అదేంటంటే..?

ఎన్టీఆర్ ధరించిన దుస్తుల స్పెషాలిటీ గురించి యాంకర్ అడిగింది. ఎన్టీఆర్ షర్ట్​పై ఉన్న పులి బొమ్మను చూసి దాని గురించి ఆరా తీసింది. దానికి సమాధానమిస్తూ ఎన్టీఆర్.. ‘ఇది నా ఫ్రెండ్ గౌరవ్ అరోరా డిజైన్ చేసిన డ్రెస్సు. ఆస్కార్ రెడ్ కార్పెట్ నేను మాత్రమే కాదు నాతో పాటు ఇండియా నడవాలనే ఉద్దేశంతో ఈ డ్రెస్​ను డిజైన్ చేయించాను. ఇదిగో పులిని చూశారు కదా.. ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా’లో నాతో కలసి దూకిన పులియే. ఇండియాలో జాతీయ జంతువు పులి. అందుకే భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నేను ఈ వస్త్రధారణలో వచ్చాను.’ అని ఎన్టీఆర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news