ఎన్టీఆర్ కొర‌టాల సినిమాకోసం భారీ సెట్.. ఎక్క‌డంటే..?

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబోలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లు పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ నిర్మాణం కూడా పూర్త‌యిన‌ట్టు స‌మాచారం. ఎన్టీఆర్ నివాసానికి ద‌గ్గ‌ర‌లోనే జూబ్లిహిల్స్ లో ఈ సెట్ ను వేసిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌య్యింది.

అంతే కాకుండా కొర‌టాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్ప‌టికే పూర్త‌య్యింది. దాంతో ఎన్టీఆర్ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షో లోనూ హోస్ట్ గా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో కు కూడా ఎన్టీఆర్ గుడ్ బై చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కొర‌టాల కాంబోలో ఇప్ప‌టికే జ‌న‌తా గ్యారేజ్ సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. దాంతో రాబోయే సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news