ఇండస్ట్రీకి గడ్డు కాలం అంటే నేను నమ్మను – ఎన్టీఆర్

-

ఇండస్ట్రీకి గడ్డు కాలం అంటున్నారు థియేటర్స్ కి జనాలు రావడం లేదు అంటున్నారు ఇదంతా నేను నమ్మనని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. అద్భుతమైన చిత్రం వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప హృదయం వున్నారని తెలుగు ప్రేక్షక దేవుళ్ళు పై ప్రసంశలు కురిపించారు. కళ్యాణ్ రామ్ నటించిన “బింబిసార” ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ కార్యక్రమానికి అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా, దర్శకుడు వశిష్టపై, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్‌పై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. బింబిసార ను ఆదరిస్తారని తెలుగు ఇండస్ట్రీ కి ప్రేక్షకులు కొత్త ఊపిరి పొయ్యాలి ఇండస్ట్రీ చల్లగా వుండాలని కోరారు.

‘బింబిసార‌’ సినిమాకు అన్నయ్య తప్ప టాలీవుడ్‌ పరిశ్రమలో ఎవ్వడు సెట్‌ కాడని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. సినిమా చూసి కాలర్ ఎగరేసుకునేంత వరకు రిజల్ట్‌ను పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అని కొన్నాళ్ల క్రితం అదే వేదికపై వాగ్దానం చేశాను. కళ్యాణ్ రామ్‌ని బింబిసారలో చూసిన తర్వాత మీరు నిస్సందేహంగా కాలర్‌ ఎగురవేస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news