రేటింగ్‌లో అదరగొడుతున్న NTV.. 14 వారాలుగా టాప్‌ లోనే !

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ ఛానెల్‌.. రేటింగ్స్‌ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగులో అగ్ర స్థానంలో ఉన్న టీవీ 9 పునాదులను కదిలించేలా.. ఎగిసిపడుతోంది ఎన్టీవీ. బార్క్‌ రేటింగ్స్‌ విషయంలో ఎన్నో వివాదాలు, కేసుల తర్వాత తిరిగి బార్క్‌ రేటింగ్స్‌ విడుదల చేస్తున్న నేపథ్యంలో న్యూస్‌ ఛానెళ్ల రేటింగ్స్‌ పరిస్థితి ఆసక్తిగా మారుతుంది. గత కొంత కాలంగా తెలుగు మీడియాలో టీవీ 9 బాగా వెనుకబడిందని రేటింగ్స్‌ ను బట్టి తెలుస్తుంది. 14 వారాలుగా టీవీ 9 ను వెనక్కి నెట్టి.. నరేంద్ర చౌదరి కి చెందిన ఎన్టీవీ టాప్‌ లో దూసుకుపోతుంది. గతంలో కూడా టీవీ 9 ను దాటి ఎన్టీవీ, మిగిలిన ఛానెళ్లు అగ్రస్థానాన్ని అందుకున్నాయి.

కానీ వరుసగా 14 వారాల పాటు ఎన్టీవీనే నంబర్‌ 1 స్థానంలో నిలబడటం చరిత్రే. అంతేకాదు.. రేటింగ్స్‌ ప్రకారం కూడా చూసుకున్నా… ఎన్టీవీకి దరిదాపుల్లో కూడా మరో ఛానెల్‌ లేదు. దీనికి కారణంగా ఆ ఛానెల్‌ ప్రసారం చేసే కార్యక్రమాలనే చెప్పాలి.

ఎప్పటి కప్పుడు బ్రేకింగ్స్‌ న్యూస్‌లు, పొలిటికల్‌ ఎనాలిసిస్‌ లు, సినీ, ఆరోగ్య కార్యక్రమాలతో.. ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండటం.. స్పెషల్‌ కార్యక్రమాలు నిర్వహించడంలో ఎన్టీవీ ప్రత్యేకతను గుర్తించే ప్రజలు… ఎన్టీవీకి ఈ అరుదైన గౌరవాన్ని ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం 14 వారాలుగా విడుదల అవుతున్న రేటింగ్స్‌ ప్రకారం.. సగటున 75.2 రేటింగ్‌ పాయింట్లతో ఎన్టీవీ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత టీవీ 9 కి 46.8, వీ6 ఛానల్‌ 30 పాయిట్లు ఉన్నాయి. తదుపరి నాలుగైదు స్థానాల్లో టీవీ 5, ఏబీఎన్‌ ఆంధ్ర జ్యోతి ఛానెళ్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news