న్యూడ్ వీడియో కాల్ చేసి కవ్వింపులు..20కోట్లు సంపాదించిన ఖిలేడీలు…!

రోజు రోజుకు సైబ‌ర్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ యువ‌కుల‌ను మోసం చేసి కోట్లు దోచుకున్న ఓ జంట‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివ‌రాల్లోకి వెళితే…ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఘ‌జియాబాద్ కు చెందిన భార్యాభ‌ర్తలు సప్నా గౌతమ్, యోగేశ్‌లకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ నింధితుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. యువ‌కుల‌కు వీడియో కాల్స్ చేస్తూ వారిని ఎలా మోసం చేయాలో ఆ వ్య‌క్తి స‌ప్నా యోగేశ్ కు తెలిపాడు. అత‌డు చెప్పిన‌ట్టుగా సప్నా గౌత‌మ్ కొంత మంది యువ‌తుల‌కు న్యూడ్ వీడియో కాల్స్ చేసి మాట్లాడ‌టంలో ట్రైనింగ్ ఇచ్చింది.

vishakapatnam nude video call case

పోర్న్ సైట్ ల‌లో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తామ‌ని నంబ‌ర్ లు పెట్ట‌డం..ఆ త‌ర‌వాత మెసేజ్ చేసిన వారికి వీడియో కాల్స్ చేయడం మొద‌లు పెట్టారు. అలా యువ‌తులు వీడియో కాల్స్ చేసిన స‌మ‌యంలో యువ‌కుల‌తో సైతం బ‌ట్ట‌లు విప్పించే వారు. దానిని వీడియో తీసి డబ్బులు బ్లాక్ మెయిల్ చేయ‌డమే ప‌నిగా పెట్టుకున్నారు. కాగా ఓ సీఏ కంపెనీ య‌జ‌మాని ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠా గుట్టు ర‌ట్ట‌య్యింది. నింధితులు బాధితుల వ‌ద్ద నుండి రూ.20 కోట్ల వ‌ర‌కూ దోచుకున్న‌ట్టు విచార‌ణ‌లో తేలింది. దాంతో భార్య భ‌ర్త‌ల‌తో పాటు కిలేడీల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.