రిటైర్ అయ్యాక.. ఎన్టీఆర్ పై పుస్తకమే రాస్తానని సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ ప్రకటించారు. ఎన్టీఆర్ కు తిరుపతితో ఎంతో అనుబంధం ఉంది..ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువ… ఆయన ఓ సమగ్ర సమతా మూర్తి అని కొనియాడారు. రైతుబిడ్డగా, రంగస్థల నటుడిగా, కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగారు..ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అన్నారు.
పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం దక్కించుకున్న సంచలన వ్యక్తి ఎన్టీఆర్..ఎన్టిఆర్ తో నాకు సన్నిహిత సంబంధం ఉండేదని పేర్కొన్నారు. నాపై ఎన్టీఆర్ మనిషి అని ముద్ర వేశారు. దానికి నేను గర్విస్తున్నానన్నారు. కాలేజీ చదివే రోజుల్లోనే నేను ఆయన్ను అభిమానించే వాడిని..1983లో ఆయన కోసం పరోక్షంగా పనిచేశానని తెలిపారు.
సంక్షోభ సమయంలో ఆయన తరపున వాదించడానికి కూడా ఎవ్వరూ రాలేదు. కానీ ప్రజాభిమానం తో ఆయన తిరిగి పదవి దక్కించుకున్నారు…అధికారం పోయాక ఆయన వెంట ఎవ్వరూ రాలేదు. అది నేను దగ్గరగా చూసానని గుర్తు చేశారు. అప్పట్లో ఢిల్లీకి ఎన్టీఆర్ నన్ను తీసుకెళ్లే వారు… ఆయనకు నేను మందులు అందించేవాడిని పేర్కొన్నారు. నన్ను ఎన్టీఆర్ నాన్న అని పిలిచేవారు…. వ్యక్తిగత, కుటుంబ విషయాలలో ఆయనకు న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాడినన్నారు.