మంత్రి హరీష్ రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

-

హైదరాబాద్ కోకాపేట లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇంటిని వైద్య విద్యార్థులు ముట్టడించారు.ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ లో తమకు సీట్లు వచ్చినా.. మెడికల్ కౌన్సిల్ తనిఖీలతో కళాశాల అనుమతి రద్దు చేయడంతో రోడ్డున పడ్డామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రిని కలిసిన 79 మంది విద్యార్థులు.. తమను రీలోకేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎంఎంసి ఆదేశాలు జారీ చేసిన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఏడాది ఎక్కడ వృధా అవుతుందో అని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని హరీష్ రావు వద్ద కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థుల సమస్యలపై స్పందించిన మంత్రి హరీష్ రావు.. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news