జూన్ 2న కేసీఆర్‌కు రేవంత్ సర్కార్ సన్మానం

-

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. 2024 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేండ్ల గడుస్తున్న సందర్భంగా.. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారందరినీ సన్మానించడానికి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ప్రజల కళను సాకారం చేసిన సోనియా గాంధీతోపాటు పలువురు ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేసీఆర్‌కు ఆహ్వానం పంపనున్నట్లు తెలుస్తోంది.

జూన్ 2న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో పదివేలమందితో ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఇచ్చింది సోనియానే అనే భావన ప్రజల్లో కల్పించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. అలాగే బీఆర్ఎస్ నేత కేసీఆర్‌కు అధికారికంగా ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. అంతేకాదు కేసీఆర్‌ను ఈ వేడుకలకు రప్పించి, స్వయంగా రేవంత్ సన్మానించేలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు మరీ కేసీఆర్ హాజరవుతారో లేదో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news