ఈనెల 30వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రెండు నిముషాల పాటు మౌనం పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు ఎక్కడి వారు అక్కడే నిల్చుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరపడం ఆనవాయితీగా వస్తోంది.
ఇక భారతదేశంలో ఏడాదిలో ఆరు రోజులను అమరవీరుల సంస్మరణ దినోత్సవం గా జరుపుకుంటారు. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి జ్ఞాపకార్ధం వీటిని సంస్మరణ దినోత్సవాలు గా జరుపుతారు. జనవరి 30 కి సంబంధించి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ చనిపోయిన రోజు కావడంతో ఆయన వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినోత్సవం గా జరుపుతున్నారు. ఆరోజున రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి రాజ్ ఘాట్ లో ఉన్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటిస్తారు.