ఈ అనంత సృష్టిలో కేవలం భూమ్మీద మాత్రమే మానవ మనుగడ సాగుతోంది. మిగతా ఏ గ్రహం మీద జీవరాశిఉందో ఎవరికీ తెలియదు. ఇక దీనిపై ఇప్పటికే ఎన్నో రకాలుగా ప్రయోగాలు సాగుతూనే ఉన్నాయి. భూమితో పాటు ఉన్న మిగతా గ్రహాల మీద ఇప్పటికే సైంటిస్టులు ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. దాంతో అనేక విషయాలు ఇప్పటికే వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఓ సంచలన విషయం వెల్లడైంది.
ప్రఖ్యాతి గాంచిన నాసా సైంటిస్టులు ఎప్పటి నుంచో చంద్రుడు అలాగే గురు గ్రహ ఉపగ్రహం అయిన గనీ మీడ్‌పై కూడా చాలా రకాలుగా ప్రయోగాలు చేస్తూ ఎన్నో విషయాలను కనుగొన్నారు. మరీ ముఖ్యంగా ఏండ్లుగా హబుల్ టెలిస్కోప్‌తో పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.
అదేమంటే టెలిస్కోప్ ఇచ్చిన ఓ ఇంపార్టెన్స్ డేటాను పరిశీలించి నాసా సైంటిస్టులు అక్కడ వాటర్ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఉపగ్రహం గనీమీడ్ క్రస్ట్ కింద ఎన్నో ఏండ్లుగా 100 మైళ్ల దూరంలో పెద్ద పెద్ద మహాసముద్రాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. ఆ సముద్రాలు ఏకంగా మన భూమిపై ఉన్న వాటి కంటే ఎక్కువ పరిమాణంలో విస్తరించి ఉన్నాయని సైంటిస్టుటు వివరిస్తున్నారు. కాకపోతే అక్కడ మానవ మనుగడకు ఏ మాత్రం అవకాశం లేదని చెబుతున్నారు.