ఇప్పటికే కరోనా వంటి మహమ్మారితో ప్రపంచమంతా గందరగోళానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. లక్షల్లో ప్రాణాలు బలయ్యాయి. కోట్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు మానవులకూ బర్డ్‌ఫ్లూ వస్తోంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వైరస్ మళ్లీ కలకలం రేపింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌తో నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి మరణించింది. ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు ICMR నిర్ధారించి, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది.