ఆంధ్రప్రదేశ్ లో ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రాష్ట్రం ఆంగుల్లోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ నుంచి ఏపీకి ట్యాంకర్ ద్వారా కొనసాగుతున్న ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు అని తెలిపింది. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ఏపీకి ప్రతి రోజూ 20 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను జిందాల్ స్టీల్ పంపిస్తుంది.
ఆక్సిజన్ కొరత తీరేవరకు సరఫరా కొనసాగుతుందని జిందాల్ యాజమాన్యం స్పష్టం చేసింది. జిందాల్ స్టీల్ నుంచి వస్తున్న ఆక్సిజన్ తో వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో వైద్యులు ఎంతో మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారు అని పేర్కొంది ప్రభుత్వం. జిందాల్ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున వైద్య ఆరోగ్యశాఖ కృతజ్ఞతలు చెప్పింది.