ఆఫ్ లైన్ యాష్ ట్యాగ్… “నెక్స్ట్ ఎవరు”: లిస్ట్ దాదాపు ఇదే?

-

సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నా… ప్రజల సొమ్మును కాపాడాలని జగన్ చూస్తున్నాడన్నా… జగన్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడన్నా… ప్రజాధనంపై జగన్ కు ఉన్న శ్రద్ధ ఇదన్నా… ప్రతిపక్షం లేకుండా ఉండాలని జగన్ కోరుకుంటున్నారన్నా… ప్రజలపక్షపాతిగా జగన్ పనిచేస్తున్నారన్నా… ఏసీబీ కేసులు కక్షసాధింపుల్లో భాగమే అన్నా… చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నా… ఎవరు ఏమన్నా, ఏమనుకున్నా… ఏపీలో ఏసీబీ దాడులు, సీబీఐ ఎంక్వైరీలు ఆగేపరిస్థితులు అయితే లేవు! సరికదా… ఆ లిస్ట్ మరీ పెద్దదిగా పెరిగిపోతుంది!! దీంతో… “నెక్స్ట్ ఎవరు” అనేది ఏపీలో ప్రస్తుతం ఆఫ్ లైన్ యాష్ టాగ్ అయిపోతుంది!

మొన్న చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా లలో భారీగా అవినీతి జరిగిందని.. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణాలే జరిగాయని సీబీఐ కి అప్పగించింది ఏపీ సర్కార్. ఈ క్రమంలో ఈఎస్ఐ లో పెద్ద స్కామే జరిగిందని ఏసీబీ అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది. ఇక భారీ సంఖ్యలో అక్రమాలకు పాల్పడ్డారని, చట్టాలను అతిక్రమించారని జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు పోలీసులు! ఈ క్రమంలో నెక్స్ట్ ఎవరు అంటే నెక్స్ట్ ఎవరు అనే చర్చ అటు ప్రజలు, అధికారపక్షాలతో పాటు ప్రతిపక్షంలో కూడా మొదలయ్యాయి!!

అచ్చెన్నాయుడు అనంతరం నాటి మంత్రుల జాబితాలో నెక్స్ట్ ఉండబోయేది నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు అని తెలుస్తుంది! అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా జగన్ ఎంత మొత్తుకున్నా… అది క్విడ్ ప్రోకో కాదులే అన్నట్లుగా నాటి అధికార టీడీపీ నేతలు వెక్కిరించారు. కానీ… అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కార్ దానిపై సిట్ ఏర్పాటుచేసింది.. ఇదే క్రమంలో సీఐడీ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫలితంగా పైన పేర్కొన్న ముగ్గురూ రెడీ గా ఉండాలని తెలుస్తోంది!!

ఇదే క్రమంలో జగన్ అధికారంలోకి రాగానే తన మార్కు పాలనకు సూచికగా చేసినపని… రివర్స్ టెండరింగ్ కార్యక్రమం! ఇందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నుంచి సుమారు వేల కోట్ల రూపాయలు వెనక్కి వచ్చాయి!! ఇదే క్రమంలో పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నుంచే మరికొన్ని వేల కోట్ల రూపాయలు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి! ఈ క్రమంలో నెక్స్ట్ దేవినేని ఉమ కే అవకాశం ఉండొచ్చని అంటున్నారు!

అదేవిధంగా చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుక పథకాల్లో రూ.వందల కోట్లలో అవినీతి జరిగినట్లు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ధారించిన క్రమంలో… మాజీమంత్రి పరిటాల సునీతకు చిక్కులు తప్పవని తెలుస్తుంది. ఇదే క్రమంలో మాన్సాస్ ట్రస్ట్ లో జరిగిన అక్రమాలలో అశోక గజపతి రాజు, కుటుంబరావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరోజు ఇటో అటో వీరు కూడా రెడీగా ఉండాలని తెలుస్తుంది. ఇక నేనే డాన్… అన్నట్లుగా వ్యవహరించిన చింతమనేని ఫైల్ కూడా హాట్ హాట్ గా రెడీగా ఉందని అంటున్నారు!

అదే క్రమంలో టూరిజం కాంట్రాక్టుల్లో జరిగిన అక్రమాలపై భూమా అఖిలప్రియ.. మైనింగ్ అక్రమాల్లో దామచర్ల మొదలైన వారికి తమ నిజాయితీని నిరూపించుకునే అవకాశం జగన్ సర్కార్ కల్పించనుందని తెలుస్తుంది! విచిత్రం ఏమిటంటే… ఈ అన్ని కేసుల్లోనూ బాబు – చినబాబుల ప్రమేయం తప్పకుండా ఉంటుందని జగన్ సర్కార్ నమ్ముతుందట!! దాంతో… ప్రతీ కేసులోనూ తమ నిజాయితీని నిరూపించుకునే అవకాశం వారికీ రావొచ్చని అంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news