మాజీ మంత్రి ఈటల కుటుంబీకుల అసైన్డ్ భూమి కబ్జా ఆరోపణలపై మాసాయిపేట తహశీల్దార్ మాలతి , వెల్దుర్తి తహశీల్దార్ సురేష్ కుమార్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. మాసాయిపేట మండలం అచ్చంపేటలోని జమున హేచరీస్ భూ వివాదం పై గ్రామ కార్యదర్శులను పిలిచి స్టేట్ మెంట్లు రికార్డు చేశాము అని తెలిపారు. జమున హేచరీస్ యాజమాన్యం 2018లో అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు ఎన్ఓసీ తీసుకున్నారు అని అన్నారు.
2019 లో మరో సారి పంచాయతీ కార్యదర్శుల పై బలవంతంగా వత్తిడి తీసుకవచ్చి ఎన్ఓసీ తీసుకున్నారు అని వివరించారు. హకీంపేటలోని 111 సర్వే నెంబర్ లో జమున హేచరీస్ యాజమాన్యం ఫీడ్ ప్లాంట్ కడుతోంది అని దీనికి అనుమతి లేనందున నిర్మాణం ఆపివేయాలని గ్రామ కార్యదర్శి వెళ్ళి రెండు సార్లు చెప్పారు అని వివరించారు. 81 సర్వే నెంబర్ లో 5.35 ఎకరాలలో అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించి ఆపివేశారు అని పేర్కొన్నారు.
130 సర్వే నెంబర్ లో 18.35 ఎకరాలు.. ఇందులో 3 ఎకరాల పట్టా భూమి.. మిగిలిన భూమి 15.35 సీలింగ్ భూమి ఉంది అని వివరించారు. మొత్తం 90 ఎకరాల్లో అసెన్డ్ భూమి సర్వే కోసం అచ్చంపేట, హాకింపేటలకు చెందిన 75 మంది రైతులకు నోటీసులు ఇచ్చామని అన్నారు. 26 , 27 ,28 మూడు రోజులలో పూర్తి స్థాయిలో సర్వే చేస్తామని వివరించారు.