పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్… బడ్జెట్ లో నిధుల కేటాయింపు

-

తెలంగాణ బడ్జెట్ లో అనుకున్నట్లుగానే వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. బడ్జెట్ లో  రూ. 24,254 కోట్ల కేటాయించిది. వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు భారీగా నిధులు కేటాయించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు భారీగా నిధులను కేటాయించింది. దేశంలో పామాయిల్ డిమాండ్ బాగా ఉందని … భారత దేశం ఏటా రూ. 80 వేల కోట్ల పామాయిల్ ను దిగుమతి చేసుకుంటుందని హరీష్ రావు అన్నారు. పామాయిల్ సాగు చాలా సులభం అని.. రాష్ట్రంలో సాగు నీటి వసతి మెరుగయ్యాక పామాయిల్ సాగుకు అనుకూలంగా మారిందని ఆయన అన్నారు. కోతుల బెడద, చీడ పీడల బెడద ఉండకపోవడంతో.. పామాయిల్ రైతులు బాగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని హరీష్ రావు అన్నారు.  రాష్ట్రంలో 2022-23 సంవత్సరంలో 2.5 లక్షల ఎకరాలను సాగును లక్ష్యంగా పెట్టుకుందని.. దీని కోసం రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నామని హరీష్ రావు అన్నారు. దేశంలో ఈవిధంగా పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్న రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news