శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

-

ఫ్యామిలీ హీరో శర్వానంద్ చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మహానుభావుడు సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో నిరాశలో ఉన్న శర్వానంద్ కు అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఒకే ఒక జీవితం కలిసొచ్చింది. శర్వా పక్కా ఫ్యామిలీ హీరో అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా.

శ్రీకార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 9న విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ నేప‌థ్యంలో అమ్మ సెంటిమెంట్ తో తెర‌కెక్కిన ఈ మూవీలో అక్కినేని అమ‌ల కీల‌క‌పాత్ర పోషించింది. ఇక ఈ చిత్ర హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌ దక్కించుకుంది.

అక్టోబర్‌ 20 నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తాజాగా సోనీ లివ్‌ ప్రకటించింది. “జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV International లో” అంటూ ట్వీట్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news