బాలీవుడ్ స్టార్ షారుక్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

-

ఒక సాధారణ టీవీ నటుడు.. వెండితెరపై అడుగుపెట్టి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. బాలీవుడ్ నెంబర్ వన్ సింహాసనంపై కూర్చున్నాడు. అతనే.. బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తిరుగులేని స్టార్​గా ఎదిగాడు కింగ్ ఖాన్. హీరోగా తిరుగులేని స్టార్ అయిన తర్వాత చిత్ర నిర్మాతగానూ.. వ్యాపారవేత్తగానూ.. మారి ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నాడు.

ఐపీఎల్​ నైట్​ రైడర్స్ ఓనర్​గా కూడా ఉన్న షారుక్.. అవకాశం ఉన్న ప్రతీ రంగంలోనూ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు. మరి, ఇన్ని ఆదాయ మార్గాలున్న షారుక్​ ఆస్తుల విలువ ఎంత? మీకు తెలుసా?? రండి.. బాలీవుడ్ బాద్​షా అస్తులు లెక్కేద్దాం.

బాలీవుడ్ కేంద్రమైన ముంబైలోనే షారుక్ ఎక్కువగా ఉంటారు. ఈ నగరంలో అత్యంత ఖరీదైన బాంద్రా ఏరియాలో లగ్జరీ ఇల్లు ఉంది. దీనిపేరు “మన్నత్”. ఈ ఇంటిని షారూక్ కొన్నేళ్ల క్రితమే రూ.13 కోట్లకు కొన్నాడు. అయితే.. షారుక్ ఖాన్ స్వస్థలం.. ఆయన భార్య గౌరీ ఖాన్ స్వస్థం కూడా దిల్లీనే. దిల్లీలో కొన్నేళ్ల కిందట ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. షారుక్ ఫ్యామిలీ దిల్లీకి వెళ్లినపుడు అందులోనే నివాసం ఉంటుంది.

షారుక్ ఖాన్‌ ఎన్నో గౌరవాలు అందుకున్నారు. అందులో ఒకటి దుబాయ్ బ్రాండ్ అంబాసిడర్. ఈ గౌరవం పొందిన షారుక్​కు దుబాయ్ గోల్డెన్ వీసా కూడా ఉంది. దుబాయ్​కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఉండి.. అక్కడ నివాసం లేకుంటే ఏం బాగుంటుంది చెప్పండి..? అందుకే.. అక్కడి కాస్ట్లీ ఏరియా పామ్ జుమెరయ్‌లో ఒక లగ్జరీ విల్లా కొనిపారేశారు. దానికి షారుక్​ “జన్నత్” అని పేరు పెట్టాడు.

ఇక, ముంబైకి సమీపంలోని అలీ బాగ్‌లో కూడా షారుక్‌కు మరో విల్లా ఉంది. ఈ అధునాతన విల్లాలోనే.. షారుక్ ప్రతి ఏటా తన బర్త్​డే సెలబ్రేట్ చేసుకుంటాడు. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాను.. తన వైఫ్ గౌరీ అభిరుచికి అనుగుణంగా నిర్మించాడు షారుక్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్​తో పాటు హెలీపాడ్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.

లండన్​లోనూ షారుఖ్​కు కళ్లు చెదిరే బంగ్లా ఉంది. పార్క్ లేన్​లో ఉండే దీని ఖరీదు తెలిస్తే.. కళ్లు తేలేస్తారు. ఆ భవనాన్ని.. దాదాపు 183 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. లండన్ వెళ్లినప్పుడు ఖాన్ ఇక్కడే ఉంటారు. ఎలాంటి అండా లేకుండా.. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఒక టీవీ ఆర్టిస్టు.. బాలీవుడ్​ను ఏలేసి.. అనితర సాధ్యమైన ఆస్తులు కూడబెట్టడం అసామాన్యమైన విషయం.

Read more RELATED
Recommended to you

Latest news