నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కలిపింది ఇద్దరినీ..!!

-

లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కి గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ RRR టీం కు అభినందనలు తెలిపారు.

ఇక పాట పాడిన  రాహుల్‌ సిప్లిగంజ్‌ సాక్షాత్తూ  దేశ ప్రధాన మంత్రి ట్వీట్ చేసే సరికి ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. రాహుల్  మాట్లాడుతూ, `నాటు నాటు`పాట గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుని అందుకోవడం చాలా సంతోషంగా, ఎమోషనల్‌గా ఉంది. ఈ పాటలోని స్టెప్పులు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బాగా వైరల్‌ అయ్యాయి అంటూ అందరికి బిర్యానీ పార్టీ ఇస్తా అని వాగ్దానం చేశాడు.

అన్నట్టుగానే రాహుల్ అందరికి పార్టీ ఇచ్చాడు. ఇక పార్టీకి బిగ్ బాస్ షో అందం పాత ప్రేయసి అషు రెడ్డి  కూడా వచ్చింది.తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో హగ్ చేసుకొని హడావుడి చేసింది. అంతే కాకుండా చెంపలు పట్టుకుని ముద్దు చేస్తూ కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన అషు రెడ్డి ‘నాటు సక్సెస్’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news