సెన్సేషనల్ సర్వే..కారు-కమలం మధ్య టఫ్ ఫైట్!

-

తెలంగాణలో ఎన్నికల సీజన్ మొదలైంది..మరో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి..ముందస్తు ఎన్నికలు జరిగితే చెప్పలేం గాని..లేదంటే షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని ఇటు అధికార బీఆర్ఎస్..తొలిసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ చూస్తుంది. ఇక చాలాకాలం అధికారానికి దూరమైన కాంగ్రెస్..ఈ సారైనా అధికారంలోకి రావాలని చూస్తుంది.

ఇలా ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. అయితే రాష్ట్రంలో పార్టీల బలాబలాలపై రకరకాల సర్వేలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రతి పార్టీ సొంత సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇతర సంస్థలు సైతం సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇదే సమయంలో ఆత్మసాక్షి సంస్థ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో సర్వే నిర్వహిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆత్మసాక్షి సంస్థ తాజాగా ఓ సర్వే విడుదల చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి లీడింగ్ ఉందని తేలింది.

మొత్తం 119 స్థానాలు ఉండగా వాటిల్లో 50-53 సీట్లు గెలుచుకునే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీకి ఉందని సర్వేలో తేలింది. అంటే మ్యాజిక్ ఫిగర్‌ 60కి తక్కువలోనే బీఆర్ఎస్ సీట్లు ఉన్నాయి. ఇటు బీజేపీ 26-28 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. అటు కాంగ్రెస్ పార్టీ 18-23 సీట్లు గెలుచుకుంటుందని సర్వే చెబుతుంది. ఇక ఎం‌ఐ‌ఎం తనకున్న 7 సీట్లలో సత్తా చాటడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

ఇక 10-12 సీట్లలో బీఆర్ఎస్-బీజేపీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని తెలుస్తోంది. ఆ సీట్లలో బీఆర్ఎస్ పై చేయి సాధిస్తే బీఆర్ఎస్ అధికారం సాధించడం గ్యారెంటీ. అదే సమయంలో తెలంగాణలో టీడీపీకి గెలిచే బలం లేదు గాని…కొన్ని సీట్లలో గెలుపోటములని తారుమారు చేయవచ్చని సర్వేలో తేలింది. అంటే బీజేపీకి టీడీపీ సపోర్ట్ ఉంటే కొంతమేర బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి చివరికి ఎవరు సత్తా గెలుస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news