ఆ హీరయిన్ తన పాతబుద్ధులు వదులుకోవడం లేదా..!!

-

ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. లేదంటే మన బతుకు గేటు దగ్గరే వుండి పోతోంది. చాలా సార్లు టాలెంట్, అందం వున్నా కూడా ఏ అవకాశాలు రాక బాధపడుతూ ఉండి పోవలసి వస్తుంది. కరెక్ట్ గా ఈ పరిస్థితిని కొందరు అనుకూలంగా మార్చుకొని  అందమైన అమాయకమైన అమ్మాయిలకు అవకాశం ఇస్తామని బుట్టలో వేసుకుంటారు. తీరా వాళ్ళు హీరోయిన్ అయ్యామని కలలో వుండే సరికి వారు వ్యభిచారం లోకి లాగబడుతున్నారు. 

 

ఈ దందా వెనకాల ఒక సీనియర్ హీరోయిన్ వుంది. ఆమె ఇప్పటికే ఇలాంటి చెత్త పనులు ఎన్నో చేసింది. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసింది. గతంలో ఆమె బాగోతంను  కొందరు పెన్ కెమేరా సాయంతో స్టింగ్ ఆపరేషన్ చేసి  బట్ట బయలు చేశారు. దానితో ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. దీనితో ఆమె పరువు మొత్తం పోయింది.చివరకి ఎలాగోలా దీని నుంచి బయట పడింది. ఈ పరిస్థితితో ఆమె డాన్సింగ్ స్కూల్ కూడా మూతబడింది. దీనితో మళ్లీ భార్య, భర్త వేరే చిన్న పల్లె టూరు వెళ్ళి వుంటున్నారు.

 

అయితే ఆమె మళ్లీ పాత బుద్ధులు చూపిస్తోందని ఒక విషయం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ ఊరు దగ్గరో వున్న ఒక అమ్మాయి ఈమెతో స్నేహం చేసేదట. ఆమె దగ్గర తన సినిమా పరిచయాలు గురించి గొప్పలు చెప్పిందట. దానితో నమ్మిన అమ్మాయి ఒక్క ఛాన్స్ ఇప్పించమని రిక్వెస్ట్ చేసిందట. దానితో చేపవలలో పడ్డది అని భావించి తన రెగ్యులర్ కస్టమర్ అయిన సీనియర్ ప్రొడ్యూసర్ కు రమ్మని చెప్పి గెస్ట్ హౌస్ బుక్ చేసిందట. ఒక రోజు అమ్మయిని ప్రొడ్యూసర్ పిలుస్తూ వున్నారని గెస్ట్ హౌస్ కి పిలిపించిందట. అక్కడకి వచ్చిన అమ్మాయితో సారు లోపల వున్నారని, లోపలి కి పంపి గొళ్ళెం పెట్టిందట. దీంతో షాక్ తిన్న అమ్మాయి ప్రొడ్యూసర్ తో నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి ఎలాగోలా అక్కడనుండి బయట పడిందట. దీనితో ప్రొడ్యూసర్ సదరు హీరయిన్ ను నా టైమ్ వేస్ట్ చేశావని చెడా మడా తిట్టాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news