శశిథరూర్‌ వ్యాఖ్యలపై స్పందించి మల్లికార్జున ఖర్గే

-

మునుపెన్నడూ లేనివిధంగా ఈ సారి కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కూడా పోటీలో లేరు. అయితే.. గాంధీ కుటుంబం మాత్రం బరిలో ఉన్న ఓ నేతకు మద్దతుగా నిలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల బరిలో శశిథరూర్‌, మల్లికార్జున ఖర్గేలు ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సమానత్వం చూపించడంలేదని, తన ప్రత్యర్థి మల్లికార్జున ఖర్గేకు ఇస్తున్నంత ప్రాధాన్యత తనకు ఇవ్వడంలేదని శశి థరూర్ ఆరోపించడం తెలిసిందే. దీనిపై మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. తనకు, థరూర్ కు మధ్య ఎలాంటి శత్రుత్వంలేదని స్పష్టం చేశారు. తామిద్దరం అన్నదమ్ముల్లాంటి వాళ్లమని, తమ మధ్య విభేదాలు లేవని పేర్కొన్నారు.

No official candidate in Congress president race, says Mallikarjun Kharge -  India Today

“కొందరు భిన్నంగా మాట్లాడతారు, దానిపై నేను మరో విధంగా స్పందించగలను… కానీ థరూర్ తో నాకు ఎలాంటి సమస్యలు లేవు” అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. మరో నాలుగు రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండగా, 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే ఫేవరెట్ గా కనిపిస్తున్నారు. ఖర్గే, థరూర్ ఇద్దరికీ తమ ఆశీస్సులు ఉన్నాయని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నప్పటికీ, పలువురు నేతలు ఖర్గే వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలోనే శశిథరూర్ తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు.

 

Read more RELATED
Recommended to you

Latest news