జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం, ప్రపంచ వ్యాప్తంగా నెమ్మదిగా వ్యాపిస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి.
ఆ 60 ఏండ్ల వృద్ధుడు నవంబర్ 20న జాంబియా నుంచి ముంబయికి తిరిగి వచ్చాడు. అక్కడి నుంచి పుణెకు ట్యాక్సీలో వెళ్లాడు అని పుణె మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించామని ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు, ముంబయి నుంచి పుణె తీసుకువచ్చిన ట్యాక్సీ డ్రైవర్‌కు ఆర్‌టీపీసీఆర్ టెస్టు నిర్వహించగా ఫలితంగా నెగెటెవ్ వచ్చిందని చెప్పారు.