సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

-

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు… యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సిరివెన్నెల మరణంపై ట్విట్టర్ లో తన సంతాపాన్ని తెలియజేశారు. ’నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి .‘ అంటూ ట్విట్టర్ లో తన సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ శ్రీ అందుకుంటున్న ఫోటోను ఆడ్ చేశారు.

సిరివెన్నెల మరణంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా ట్విట్టర్ లో సంతాపాన్ని తెలియజేశారు. ’ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. అతని కుటుంబానికి & అభిమానులకు ప్రగాఢ సానుభూతి.‘ అంటూ ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news