ఈ రోజుల్లో పిల్లలను కని పెంచి వారికి ఏదో బ్రతుకు దెరువు చూపించి మంచి మార్గంలో పెడుతున్న తల్లితండ్రులకు ఆఖరి రోజుల్లో కాసింత గూడు పట్టెడన్నం పెట్టడానికి కొడుకులు వాంతులు వేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఇక ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా పొట్లపల్లి లో జరిగింది. ఆ గ్రామానికి చెందిన మెడబల్లి వెంకటయ్య కు ప్రస్తుతం 90 సంవత్సరాలు.. ఈయనకు మొత్తం నలుగురు కొడుకులు ఉన్నారు. ఈయన భార్య గతంలోనే చనిపోయింది. దానితో తండ్రిని నాలుగు కొడుకులు వంతుల వారీగా పోషించాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఈ సారి వంతు కరీంనగర్ లో ఉన్న కొడుకు దగ్గరకు వెంకటయ్య వెళ్లాల్సి వచ్చింది. కానీ ఎన్నో సంవత్సరాలుగా పొట్లపల్లి లోనే జీవించిన వెంకటయ్యకు కరీంనగర్ కు వెళ్ళడానికి మనస్సు ఒప్పుకోలేదు. ఇక్కడున్న కొడుకులు చూస్తారో లేదో అన్న ఆలోచన ఈయనలో బాగా పాతుకుపోయింది. అందుకే లోకమంతా విస్తుపోయి నిర్ణయాన్ని తీసుకున్నాడు. పొట్టకూటి కోసం బయట ఊరికి వెళ్ళడం కన్నా చనిపోవడమే మంచిదని నిర్ణయించుకుని ఊరి చివరన తానే చితి పేర్చి మంట అంటించి అందులో దూకి సజీవ దహనం అయిపోయాడు. ఈ ఘోరం ఆ ఊరి ప్రజలను ఎంతగానో బాధకు గురి చేసింది. అలాంటి కొడుకులు ఇక బ్రతికి ఉండడం వలన లాభం ఏమిటని అంతా అంటున్నారు.