జపాన్: నేడు టోక్యో ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. ఈ విశ్వక్రీడలను భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆరంభ వేడుకలు మొదలవుతాయి. ఈ వేడుకలను జపాన్ చక్రవర్తి నరుహిటో ప్రారంభించనున్నారు. నాలుగేళ్లకోసారి ఈ ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతాయి. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండా ఒలింపిక్స్ గ్రేమ్ నిర్వహించనున్నారు. మొత్తం 206 దేశాల నుంచి 11 వేలకు పైబడి క్రీడాకారులు ఈ ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనున్నారు. 42 వేదికలపై 33 క్రీడలకు సంబంధించి 339 ఈవెంట్లు జరుగుతాయి. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా ఆలస్యంగా జరుగుతున్నాయి.
ఇక అథ్లెట్ల కావాతులో భారత్ నుంచి 20 మంది పాల్గొననున్నారు. బాక్సర్ మేరీకోమ్, హాకీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ భారత జెండా ధరించనున్నారు. ఒలింపిక్స్‌లో మొత్తం 119 మంది భారత క్రీడాకారులు పాల్గొనున్నారు.
భారత్ తరపున 67 మంది పురుషులు, 52 మంది మహిళలు పాల్గొననున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు క్రీడాకారులు గ్రేమ్స్‌లో పాల్గొనున్నారు. పీపీ సింధు, సానియా మీర్జా, ప్రణీత్, సాత్విక్ ఈ ఒలింపిక్స్‌కు హాజరవుతున్నారు.