వీధి వ్యాపారుల వద్ద రూ.కోట్లు.. వారికి అవి ఎలా వచ్చాయంటే?

-

స్ట్రీట్ వెండర్స్..కరోనా కాలంలో అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది బహుశా వీరే కావచ్చు. ఎందుకో మనందరికీ తెలుసు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోగా, వీరు జీవనోపాధి లేక తల్లడిల్లారు. అయితే, ఇది సాధారాణ వీధి వ్యాపారుల ముచ్చట. మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ ఏరియాకు చెందిన వీధి వ్యాపారులు వద్ద రూ.కోట్లలో ఉన్నాయట. ఇంతకీ వారు ఎవరు? వారికి అంతగనం డబ్బులు ఎలా వచ్చాయి? తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా చదవాల్సిందే.

ఉత్తరప్రదేశ్‌లోని వీధి వ్యాపారులు సాధారణంగా ఇతర ప్రాంతాల మాదిరిగానే రోడ్డు పక్కన చిన్న షాపుల్లో తమ బిజినెస్ స్టార్ట్ చేశారు. టిఫిన్స్ , ఛాయ, బిస్కెట్స్, సమోసా ఇతరాలు అమ్ముకుంటు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, కాలక్రమంలో మంచి పేరు రావడమో లేక ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా రావడమో తెలియదు కానీ వ్యాపారంలో లాభాలు బాగానే గడించారు. అయినప్పటికీ తామున్న రోడ్ సైడ్ ప్లేసెస్‌ను విడిచిపెట్టలేదు. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులూ చెల్లించలేదు. తమకు ఆదాయం రావడం లేదని చెప్పడం స్టార్ట్ చేశారు. మరో వైపు వచ్చిన ఆదాయంతో వేరే చోట్ల రూ.కోట్ల విలువ ఉన్న ఆస్తులు కూడబెట్టారు. కాగా, ఇటీవల కాలంలో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు వీధి వ్యాపారులు ఎందుకు పన్నులు కట్టడం లేదని అనుమానం వచ్చింది.

ఏకకాలంలో దాడులు జరపగా, వారికి విస్తుపోయే నిజాలు తెలిసాయి.256 మంది చిరు వ్యాపారుల ఇళ్లపై దాడులు చేయగా, వారి ఇళ్లలో రూ.వందల కోట్లు విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయి. అవి చూసి ఆఫీసర్లు సడెన్ షాక్‌కు గురయ్యారు. జీఎస్టీ కట్టకుండానే ఇంత ఆదాయం సంపాదించారా? అనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రాథమిక సమాచారం ప్రకారం..ఈ చిరు వ్యాపారుల వద్ద రూ.375 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆఫీసర్లు కన్ఫర్మ్ చేశారు. వీధి వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news