కర్ణాటక సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్లు తీసుకున్నవారికే అక్కడకు అనుమతి.

-

ఓమిక్రాన్ కేసులతో దేశం కలవరపడుతోంది. తాజాగా కర్ణాటకలో రెండు కేసులు నమోదవ్వడంతో దేశం మొత్తం అలెర్ట్ అయింది. ఇందులో ఓ వ్యక్తి ఫారెన్ ట్రావెల్ హిస్టరీ ఉండగా… మరోకరు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని హెల్త్ వర్కర్ గా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీరిద్దరికి సన్నిహితంగా ఉన్న 5గురికి కరోనా సోకడంతో వీరి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. వీరి రిపోర్టులు వస్తే అది ఓమిక్రాన్ వేరియంటా.. కాదా అని తెలుస్తుంది.

అయితే తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ బయటపడిన వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారికే పబ్లిక్ ప్లేసులకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. సినిమా హాల్, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారినే ప్రభుత్వం అనుమతించనుంది. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని, ముఖ్యంగా ఓమిక్రాన్ వ్యాప్తిని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news