రాధేశ్యామ్ కోసం రంగంలోకి దిగిన‌ ఎస్ఎస్ థ‌మ‌న్

-

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14 న పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అవుతుంది. ఇలాంటి స‌మ‌యంలో రాధేశ్యామ్ చిత్ర బృందం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ థ‌మ‌న్ తీసుకుంటు చిత్ర బృందం నిర్ణ‌యం తీసుకుంది. కాగ సినిమా విడుద‌లకు మ‌రో 20 రోజుల ఉన్న స‌మ‌యంలో ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో సినిమా అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

కాగ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడిగా జ‌స్టిస్ ప్ర‌భాక‌ర‌న్ వ్య‌వ‌హరిస్తున్నారు. అయితే ఎస్ ఎస్ థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఉన్న సినిమాలు దాదాపు అన్ని కూడా మ్యూజిక‌ల్ హిట్ అవుతున్నాయి. అలాగే ఇటీవల బాల‌య్య అఖండ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. అఖండ సినిమాతో పాటు మ‌రి కొన్ని సినిమాల‌కు కూడా ఎస్ ఎస్ థ‌మ‌న్ ఇచ్చిన బీజీఎం సూప‌ర్ హిట్ అవుతుంది. దీంతో ఎస్ ఎస్ థ‌మ‌న్ ను బీజీఎం కోసం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news