BREAKING : ఇండియాలో 3 కు చేరిన ఓమిక్రాన్ కేసులు…

-

దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు వేగంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని 38 దేశాలలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఇండియా కూడా చేరింది. హైరిస్క్ ఉన్న దేశాల నుంచి వస్తున్న వారికి ఎయిర్ పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక వేళ పాజిటివ్ వస్తే .. శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తున్నారు. ఓమిక్రాన్ కు ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందే గుణం ఉండటంతో కేంద్ర, రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

భారత్ లో ఇప్పటికే రెండు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ఓమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో భారత్ లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 3కు చేరింది. దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్ కు వచ్చిన ఓ వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ కరోనా సోకినట్లుగా నిర్థారణ అయింది. దీంతో ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 3కు చేరింది. ఇంతకుముందు కర్ణాటక బెంగుళూర్ లో రెండు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోయ్యాయి. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా నుంచి రాగా.. మరొకరు లోకల్ గా ఉండే హెల్త్ వర్కర్ గా చెబుతున్నారు. వరసగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతుండటం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news