కరోనాపై ‘ తగ్గేదే లే..’ అంటున్న కేంద్ర ప్రభుత్వం… పుష్ప డైలాగ్ తో వినూత్న ప్రచారం

-

పుష్ప సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి కలెక్షన్లు రాబట్టిందో తెలిసిందే. రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలీవుడ్, హిందీ జనాలకు చాలా బాగా నచ్చింది పుష్ప సినిమా. పలువురు క్రికెటర్లు, సెలబ్రెటీలు పుష్ప డైలాగ్, మేనరిజంతో వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల స్టార్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజాలు పుష్ప సినిమాలోని ‘తగ్గదే లే…’ అంటూ ఫ్యాన్స్ ను పలకరించారు.

అయితే తాజాగా ఈ డైలాగ్ తోనే కరోనాపై పోరులో ‘తగ్గేదే లే..’ అంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈ డైలాగ్ తో ప్రజల్లో అవగాహన కల్పించనుంది. అల్లు అర్జున్ తన దైన స్టైల్ లో చెప్పిన ఈ డైలాగ్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప హిందీలో కూడా రీలీజ్ అయింది. ‘పుష్ప, పుష్పరాజ్‌.. మై ఝుకూంగా నహీ’ అంటూ హిందీ వెర్షన్ లో ఈ డైలాగ్ పావులర్ అయింది. ఈ డైలాగే స్ఫూర్తిగా ‘డెల్టా హో యా ఒమిక్రాన్‌.. మై మాస్క్‌ ఉతారేగా నహీ’ (డెల్టా అయినా ఒమిక్రానైనా.. నేను మాస్కు తీసేదే లేదు) అంటూ మార్చిన ఓ సరదా మీమ్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ బుధవారం తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. ఇప్పుడు ఇది ట్రెండింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news