ఢిల్లీలో 12 కు చేరిన ఓమిక్రాన్ అనుమానితులు…

-

ఢిల్లీలో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా కొత్త రూపం ఓమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం అలెర్ట్ అయింది. ముఖ్యంగా రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్ లకు పంపారు. ప్రస్తుతం ఢిల్లీలో ఓమిక్రాన్ అనుమానితుల సంఖ్య 12కు చేరింది. దిల్లీలోని లోక్​నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 12 మంది చేరినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఎనిమిది మంది చేరగా.. శుక్రవారం మరో నలుగురు చేరినట్లు పేర్కొన్నారు. శుక్రవారం చేరిన నలుగురు అనుమానితుల్లో యూకే నుంచి ఇద్దరు.. ఫ్రాన్స్​, నెథర్లాండ్స్​ నుంచి ఒక్కొక్కరు భారత్​కు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన శాంపిళ్ల రిపోర్ట్ వస్తే వీరిలో ఎంతమందికి ఓమిక్రాన్ వచ్చిందో తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీరి కాంటాక్స్ ట్రెస్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఇన్నాళ్లు. విదేశాలకే పరిమితమైన ఓమిక్రాన్ వేరియంట్ నిన్న బెంగళూర్ లో కూడా బయటపడింది. దేశంలో ప్రస్తుతం అధికారికంగా 2 ఓమిక్రాన్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news