ఓమిక్రాన్ ఎఫెక్ట్… కేంద్రం కొత్త గైడ్ లైన్స్… ఎయిర్ పోర్టుల్లో టెస్టింగ్స్

-

కరోనా కొత్త వేరియంట్ పై కేంద్రం హై అలెర్ట్ అయింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. ముఖ్యంగా కరోనా రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే వారిని క్లోజ్ గా మానిటరింగ్ చేయాలని సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ ల్లో విదేశాల నుంచి వచ్చే వారికి పలు ఆంక్షలు విధిస్తున్నాయి.

విమానం

తాజగా కేంద్రం ఓమిక్రాన్ ఎఫెక్ట్ తో అప్రమత్తం అయింది. ఎయిర్ పోర్టుల్లో కొత్త వేరియంట్ పై తాజాగా గైడ్ లైన్స్ జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ తో సంబంధం లేకుండా విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ను ఖచ్చితంగా చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఓమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా టెస్ట్ ను తప్పిని సరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. పాజిటివ్ వస్తే వెంటనే క్వారంటైన్ కు పంపించాలని… బాధితుడి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొత్త వేరియంట్ దాదాపుగా 15 దేశాలకు వ్యాపించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, బోట్స్వానా, నమీబియా, హాంకాంగ్, జింబాబ్వే దేశాల నుంచి వచ్చేవారిపై గట్టిగా నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news