రాజమండ్రి : సినిమా టిక్కెట్ రేట్లపై నగరి వై.సి.పి ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. టిక్కెట్ రేట్లు ఫిక్సిడ్ గా ఉండాలని దాసరి నారాయణరావు ఎప్పుడో చెప్పారని రోజా గుర్తు చేశారు. ప్రజలకు ఉపయోపడేందుకే సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించారని పేర్కొన్నారు. సి.ఎం. జగన్ ఏం చేసినా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుంటారని కొనియాడారు రోజా.
టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సినిమాలు ఎక్కువగా చూసే దిగువ మధ్యతరగతికి మేలు జరుగుతుందని వెల్లడించారు. కొంతమంది లాభం కోసం సినిమా టిక్కెట్ రేట్లపై గొడవ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కప్ప, పాము సామెతలా టిక్కెట్ రేట్ల వ్యవహారం మారిందని టాలీవుడ్ హీరో లకు నగరి ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం అని పేర్కొన్నారు. సినిమా టిక్కెట్ రేట్లపై తమ ప్రభుత్వం అస్సలు తగ్గదని స్పష్టం చేశారు.