అమెరికాలో తొలి ఓమిక్రాన్ మరణం… ధ్రువీకరించిన అధికారులు..

ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ విజృంభిస్తోంది. ప్రతీరోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా కొత్త వేరియంట్ వేగంగా 90కి పైగా దేశాల్లో విస్తరించింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ తో మరణాలు కూడా మొదలయ్యాయి. తాజాగా మరో మరణం చోటు చేసుకుంది. ఓమిక్రాన్ వల్ల అమెరికాలో తొలి మరణం సంభవించింది. టెక్సాస్ రాష్ట్రంలో ఈ మరణం చోటు చేసుకుంది. దీన్ని అక్కడి వైద్యాధికారులు కూడా ధ్రువీకరించారు.

ప్రపంచంలో యూకేలో ఇప్పటి వరకు 12 మంది ఓమిక్రాన్ మరణాలు సంభవించాయి. తాజాగా అమెరికాలో మరో మరణంతో మరణాల సంఖ్య 13కు చేరింది. ఓమిక్రాన్ వల్ల తొలి మరణం కూడా యూకేలోనే నమోదైంది. అయితే మొదటగా ఓమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలే ఉంటాయని అనుకుంటున్నప్పటికీ.. మరణాలు లేవని అనుకుంటున్నప్పటీకీ.. తాజాగా మరణాలు సంభవిస్తుండటం అందర్నీ కలవరపరుస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది.