ఆ ఘ‌ట‌న రైతు ఉద్య‌మానికి ముగింపు కాదు !

-

న్యూఢిల్లీః భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వం స‌ద‌ర్భంగా రైతులు నిర్వ‌హించిన ట్రాక్ట‌ర్ ప‌రేడ్‌లో హింస చోటుచేసుకోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ‌రాజ‌ధానిలో హింస‌కు కార‌ణ‌మైన వారిని శిక్షించాల‌ని పేర్కొన్నారు. అయితే, గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో కేంద్రం అమ‌ల్లోకి తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న పోరాటాన్ని ఈ సంఘ‌ట‌న అంతం చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. శాంతియుత ప‌ద్ధ‌తిలో రైతుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

“జనవరి 26న జరిగిన సంఘటన దురదృష్టకరం. నిజంగా నేరం చేసిన వారిని శిక్షించాలి. కానీ ఆ సంఘటన రైతుల నిరసనకు ముగింపు పలకలేదు. ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. శాంతియుత మార్గంలో రైతులను ఆదుకోవాలి. అసంతృప్తిగా ఉన్న రైతులతో మేం సంతోషంగా ఉండలేం” అని ఢిల్లీలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.

రిప‌బ్లిక్ డే రోజు రైతులు మధ్యాహ్నం 12 గంటల ముందు తమ ర్యాలీని ప్రారంభించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త‌ల‌కు దారితీసింది. ఈ నేప‌థ్యంలోనే ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్నది. ప‌లువురు ఎర్రకోటపైకి చేరుకుని స్మారక చిహ్నంపై ‘నిషన్ సాహెబ్’ అనే పతాకాన్ని ఆవిష్కరించడంతో పెద్ద కలకలం రేపింది. అలాగే, రాజధాని లోని ఐ.టి.ఓ ప్రాంతంలో పోలీసులు వారిని వెంటాడుతోన్న వీడియో కూడా వైరల్ గా మారింది.

జనవరి 26న ట్రాక్ట‌ర్ ప‌రేడ్ నేప‌థ్యంలో నెల‌కొన్న గందరగోళం తరువాత, రైతులు ఫిబ్రవరి 1న పార్లమెంట్ కు పాదయాత్ర చేప‌ట్టాల‌నుకున్న కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకున్నారు. అయితే, కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news