10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

Join Our Community
follow manalokam on social media

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ స‌ర్కిల్ పోస్ట‌ల్ రిక్రూట్‌మెంట్ 2021ను ఇండియా పోస్ట్ ప్రారంభించింది. మొత్తం 1150 జీడీఎస్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు.

post office services
post office services

ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. అందుకు గాను appost.in అనే సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఫిజిక‌ల్‌గా పంపే ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌రు. కేవ‌లం ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తుల‌ను పంపించాల్సి ఉంటుంది. ఇక అభ్య‌ర్థుల మెరిట్ ఆధారంగా ఆటోమేటిగ్గా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 1150
పోస్టు: గ‌్రామీణ్ డాక్ సేవ‌క్ (జీడీఎస్‌)
ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు ఆఖ‌రు తేదీ: ఫిబ్ర‌వ‌రి 26, 2021
ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించాల్సిన సైట్లు: indiapost.gov.in లేదా appost.in
ద‌ర‌ఖాస్తు ఫాం రుసుము: రూ.100
వ‌య‌స్సు: 27.01.2021 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండ‌వ‌చ్చు.
విద్యార్హ‌త‌: 10వ త‌ర‌గ‌తి, మ్యాథ్స్‌, ఇంగ్లిష్, లోకల్ లాంగ్వేజ్ చ‌దివి ఉండాలి.

అభ్య‌ర్థులు ఏదైనా హెడ్ పోస్టాఫీస్ లేదా ముఖ్య‌మైన పోస్టాఫీస్‌ను సంద‌ర్శించి రుసుం చెల్లించ‌వ‌చ్చు.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...