ఆషాఢం బోనాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రేపటి ఆదివారం (25న) సికింద్రాబాద్ మహాంకాళి బోనాలు నిర్వహించనున్నారు. అయితే, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ఈ ఆంక్షలు ఆదివారం తెల్లవారు జాము నుంచే అమలు కానుంది.
సికింద్రాబాద్ టొబాకో బజార్, హీల్‌స్ట్రీట్, జనరల్ బజార్– మహంకాళీ టెంపుల్‌కు వెళ్లే అన్ని రోడ్ల రాకపోకలను నిషేధించారు. బాటా క్రాస్‌రోడ్డు– సుభాష్‌రోడ్– రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ రాకపోకలు బంద్.
అదవయ్యా క్రాస్ రోడ్– మహంకాళీ టెంపుల్ వెళ్లే దారి. జనరల్ బజార్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గం.
ట్రాఫిక్ మళ్లీంపు..
- ఇక రాణీగంజ్ కర్బాలా మైదాన్ నుంచి రాకపోకలు చేపట్టే ఆర్టీసీ బస్సులు, వాహనాలను రాణీగంజ్ వద్ద మళ్లీంచి.. మినిష్టర్ రోడ్డు– రసూల్‌పురా– సీటీఓ–వైఎంసీ క్రాస్‌రోడ్డు– సెయింట్ జాన్స్ రోటరీ– గోపాలపురం లేన్– రైల్వేస్టేషన్‌కు మళ్లీంచారు.
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్»ండ్‌కు తిరిగి వచ్చే ఆర్టీసీ బస్సులు అల్ఫా హోటల్ నుంచి గాంధీ హాస్పిటల్– సజ్జన్‌లాల్ స్ట్రీట్ ఘాస్‌మండీ–బైబిల్ హౌస్–కర్బాలా మైదాన్ మీదుగా వెళ్తాయి.
బేగంపేట వైపునకు వచ్చే వాహనాలు…
- సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బేగంపేట వైపునకు తిరిగి వచ్చే వాహనాలు క్లాక్ టవర్– ప్యాట్నీ– వైఎంసీఏ– ఎస్‌బీహెచ్ గుండా వెళ్తాయి.
- బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఘాస్‌మండీ వద్ద మళ్లించి… సజ్జన్‌లాల్ స్ట్రీట్ గుండా వెళ్తాయి.
ఎస్‌బీహెచ్ నుంచి వచ్చే వాహనాలు…
- ఎస్‌బీహెచ్ నుంచి ఆర్‌పీ రోడ్డుకు వచ్చే వెహికల్స్‌ను ప్యాట్నీ వద్ద మళ్లించి... క్లాక్ టవర్– ప్యారడైజ్‌గా వెళ్తాయి. అదేవిధంగా ప్యారడైజ్– ఆర్‌పీ రోడ్డు వైపునకు వెళ్లే వాహనాలు ప్యాట్నీ క్రాస్ రోడ్డు నుంచి ఎస్‌బీహెచ్ కాలనీ– క్లాక్ టవర్ గుండా వెళ్తాయి.
- క్లాక్ టవర్– ఆర్‌పీ రోడ్డు వైపునకు వచ్చే వెహికల్స్‌ను ప్యాట్నీ వద్ద మళ్లించి ఎస్‌బీహెచ్– ప్యారడైజ్‌కు వెళ్తాయి.
ప్యారడైజ్ క్రాస్ రోడ్డు మళ్లింపు…
- సీటీఓ–ఎంజీ రోడ్డు వైపునకు వచ్చే వెహికల్స్ ప్యారడైజ్– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్– సిం«ద్ కాలనీ– మినిష్టర్ రోడ్– రాణీగంజ్– కర్బాలా మైదాన్ వైపునకు మళ్లిస్తారు. అదేవిధంగా ప్యాట్నీ సెంటర్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్– సీటీఓకు మళ్లిస్తారు.
సోమవారం కూడా…
జూలై 26న సోమవారం అమ్మవారి ఊరేగింపు, రంగం కార్యక్రమాలు ఉంటాయి. ఈనేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.
ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సెయింట్ మెరీస్ రోడ్డును మూసివేయనున్నారు. హకీంపేట్–బోయిన్‌పల్లి–బాలానగర్– అమీర్‌పేట– సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే అన్ని బస్సులను క్లాక్ టవర్ వద్దే నిలిపివేస్తారు.