పోర్న్ రాకెట్ కేసులో కీలక సూత్రదారిగా శిల్ప శెట్టి సోదరి ?

-

పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా కు ఉచ్చు బిగుసుకుంటుంది. పోర్న్ సినిమాలు వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించిన క్రైం బ్రాంచ్ పోలీసులు.. రాజ్ కుంద్రా నివాసంలో భారీగా అడల్ట్ కంటెంట్ కు సంబంధించిన వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. 122 అడల్ట్ సినిమాల నిర్మాణనికి 9 కోట్ల ఒప్పందాన్ని రాజ్ కుంద్రా కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు.

అలాగే రాజ్ కుంద్రా ఫోన్ లో కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. ఫోన్ వాట్సప్ , చాటింగ్ కాల్ లిస్ట్ ను విశ్లేశిస్తున్న పోలీసులు.. పోర్న్ సినిమాలలో వచ్చిన డబ్బు ను ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టినట్టు గుర్తించారు. అలాగే రాజ్ కుంద్రా హవాలా కు పాల్పడినట్టుగా కీలక ఆధారాలు పోలీసులకు లభ్యం అయ్యాయి.

రాజ్ కుంద్రా కు చెందిన ఎస్ బ్యాంక్ ఖాతా నుండి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతా ల మధ్య భారీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఇక ఇప్పటి వరకు 7.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు క్రైం బ్రాంచ్ పోలీసులు. ఇక శిల్ప శెట్టి సోదరి శమిత శెట్టీని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో శిల్ప శెట్టి సోదరి.. కీలక సూత్రదారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆమెను విచారించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news