ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా క్లిష్ట సమయంలో జరుగుతున్నాయి..ఒక వైపు కరోనా యూఎస్‌ను అతాలకుతలం చేస్తుంటే ప్రధాన పార్టీలు మాత్రం ఎన్నికలపై దృష్టి పెట్టాయి..కరోనాను కట్టడి చేయాల్సిన అధికార పార్టీ, అమెరికా అధ్యక్షుడు వైరస్ వ్యాప్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు..మరోవైపు సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు గెలుస్తారని జ్యోతిష్కులు, న్యూమరాలజిస్టులు అంచనాలు వేస్తున్నారు. లైఫ్ పాత్ నంబర్, మాస్టర్ ఇయర్ ఆధారంగా ట్రంప్ విజయం ఖాయమని జ్యోతిష్కులు భావిస్తున్నట్లు ప్రముఖ వార్త సంస్థ తెలిపింది..
ఒక వ్యక్తి జన్మతేదీలో అంకెలను ఒక ప్రత్యేక పద్ధతిలో కూడడం ద్వారా లైఫ్‌పాత్ నంబర్‌ను నిర్ణయిస్తారు. దీన్ని డెస్టినీ నంబర్ అనికూడా అంటారు. ట్రంప్ బర్త్‌డేట్ అంకెలను ప్రత్యేక పద్ధతిలో కూడితే 22 వస్తుంది. ఇది ట్రంప్ లైఫ్‌పాత్ నంబర్. ఈ నెంబర్ వచ్చిన వ్యక్తులు మాస్టర్ బిల్డర్స్ అని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. వీరివన్నీ భారీ ప్రణాళికలు, భారీ విజయాలని, వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువంటున్నారు. వ్యాపారం, రాజకీయాల్లో ఈ నంబరున్న వ్యక్తులు బాగా రాణిస్తారన్నారు. ఇక జోబైడెన్ బర్త్‌డేట్‌ను ప్రత్యేక పద్దతిలో కూడితే 2 వస్తుంది. ఇది అత్యంత తక్కువ శక్తి ఉన్న నంబరని, ఈ నంబరు వ్యక్తులు ఎంత పనిచేసినా గుర్తింపు పొందలేరని నిపుణులు విశ్లేషించారు. ఇక ఎన్నికలు జరిగే 2020 సంవత్సరాన్ని చూస్తే ఇది ట్రంప్‌కు మాస్టర్ ఇయర్ అని వివరించారు.
మరోసారి ట్రంపే అధ్యక్షుడు.జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు జోస్యం.
-