విటమిన్లు, పొట్రీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. వెంటనే డబ్బాలలో డ్రైఫ్రూట్స్, పోషక విలువులున్న ఆహారంతో నింపేస్తాం. ఇవి తింటే మంచిది అన్నారు కదా అతి తొందరగా ఎక్కువ ప్రొటీన్లు పొందేందుకు తినే పనిలోనూ ఉంటారు. దీంతో ఎం జరుగుతుందో అసలుకే తెలియదు. పెద్ద పెనుప్రమాదంలో ఇరుక్కుపోతారని అసలుకే గ్రహించరు గాక గ్రహించరు అంతలా ఉంటుంది తర్వాతి పరిణామం. అధిక పోషకాలు శరీరంలోకి వెళ్లడం వల్ల పొట్ట, ఇతర భాగాలలో కొవ్వు చేరి బరువు పెరగడం మొదలవుతుంది. తర్వాత ఊభకాయం, బద్ధకం, ఇలా ఒక్కొక్కటిగా సమస్యలు మొదలవుతాయి. ఆ తర్వాత అయ్యో లావైపోయాం. జిమ్‌కి వెళ్లాలి. వాకింగ్ చేయాలంటూ తెగ ఆరాటపడుతుంటారు. ఒకసారి లేజీనెస్ మొదలయ్యాక ఇక పనిలో వంగుతారా. అందుకే అతిగా మాట్లాడొద్దు అనేటప్పుడు.. అతిగా తినకు అని కూడా చెబితే బాగుంటుందని అందరి బావన. అయితే దీంతోపాటు ఏయో పండ్లలో ఎన్ని ప్రొటీన్లు ఉన్నాయి. వాటితో వచ్చే అనర్థం ఏంటి అని తెలుసుకుంటే కొంతమేరకు జాగ్రత్తగా ఉంటారు. అందుకే ఈ కింది వివరాలు.
ఇవి ఎంతమేరకు మంచివి :
1. బొప్పాయి వల్ల అనేక లాభాలున్నాయి. కానీ ఇది ఎక్కువగా తీసుకుంటే అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల చర్మం రంగు మారుతుంది. కళ్లు తెల్లగా మారుతాయి. చేతులు పచ్చరంగులోకి మారే అవకాశం ఉంది. కామెర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భినులు అస్సలు బొప్పాయిని తీసుకోవద్దు.
2. ఉప్పు అధికంగా తింటే నాలుకపై ఉండే రుచి కళికలు ఇతర రుచుల్ని గుర్తించలేవు. దాని ఫలితంగా ఏది తిన్నా నాలుక సహించదు. ఉప్పు అధికంగా తినేవారికి శరీరంలో వాపులు వస్తుంటాయి. మడమ భాగంలో ఉబ్బుతుంది.
3. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న తెల్లబియ్యంలో ఫైబర్ శాతం తక్కువ. కార్బోహైడ్రేట్స్ బియ్యంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నం తినడం మానేస్తే బరువు తగ్గిపోతారు. అన్నం ఎక్కువగా తింటే ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
4. వంటల్లో నూనె ఎక్కువగా వాడడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అజీర్తి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. నూనెను అవసరానికి మించి వంటల్లో వాడితే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల గుండె పనితీరు మందగిస్తుంది.
5. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఫాస్ట్‌ఫుడ్‌లో అన్ని పదార్థాలు పరిమాణానికి మించి వాడుతారు. ఉప్పు, కారం, మసాలాలు, చైనాసాల్ట్. ఇవన్నీ అనారోగ్యాన్ని కలిగించేవే.