బిగ్ బాస్ – 4 కోసం మళ్ళి తెరపైకి ఆ హీరో పేరు…..??

-

ఇప్పటికే స్టార్మా టివిలో ప్రసారం అయిన బిగ్ బాస్ మూడు సీజన్స్ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇక మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కు నాని, మూడవ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక వీటిలో ఎన్టీఆర్ గా హోస్ట్ గా ఉన్న మొదటి సీజన్ కు రేటింగ్స్ ఎంతో అద్భుతమైన రీతిలో లభించాయి, దానితో పోలిస్తే నాని హోస్ట్ గా ఉన్న సీజన్ 2 కు మాత్రం అంత ఎక్కువ రేంజ్ లో రేటింగ్స్ అయితే రాలేదు. ఇక ఇటీవల నాగార్జున హోస్ట్ గా ఉన్న మూడవ సీజన్ కు కూడా మళ్ళి రేటింగ్స్ పుంజుకున్నాయి.

మొత్తం 17 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్న ఈ సీజన్ లో చివరికి విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఇకపోతే వచ్చే ఏడాది ప్రారంభం కాబోయే సీజన్ 4 కోసం మరొక్కసారి ఎన్టీఆర్ ని హోస్ట్ గా తీసుకునేలా స్టార్ మా ఛానల్ వారు ప్లాన్ చేస్తున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ సీజన్ 4 ని మరింత సక్సెస్ చేసేలా కొన్ని సరికొత్త ప్లాన్స్ కూడా సిద్ధం చేస్తోందట బిగ్ బాస్ యూనిట్. ఇక ఈ సీజన్ కు ముందుగా మరొక స్టార్ హీరో ని హోస్ట్ గా తీసుకోవాలని భావించినప్పటికీ, మొదటి సీజన్ లో తన ఆకట్టుకునే హోస్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకున్న ఎన్టీఆర్ అయితేనే బెటర్ అని భావించి మరొక్కసారిగా ఆయనతోనే చేయించడానికి గట్టిగా ఫిక్స్ అయ్యారట.

 

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్, జూన్ సమయానికి ఫ్రీ అవుతారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఆయనను ఈ షో కోసం ఒప్పించాలని ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలెట్టారాట. ఇక ఎన్టీఆర్ కూడా మరొక్కసారి ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించడానికి సుముఖంగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే…..!!

Read more RELATED
Recommended to you

Latest news